న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన యూనిఫైడ్ పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేసింది. వారం రోజుల పాటు సాంకేతిక మార్పుల కోసం అందుబాటులో లేని ఈ పోర్టల్ ఇప్పుడు సరికొత్తగా రూపుదిద్దుకుంది. ఇకపై పాత పద్ధతిలో పోర్టల్ ద్వారా యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్) యాక్టివేషన్ చేయడం లేదా కొత్తగా యూఏఎన్ నంబర్‌ను కేటాయించుకునే సేవలను నిలిపివేసింది. ఈ సేవలను మరింత సురక్షితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారిక యాప్ ‘ఉమంగ్’కు బదిలీ చేసింది. ఆధార్ ఆధారిత ‘ఫేస్ అథెంటికేషన్’ ద్వారా మాత్రమే ఇకపై యూఏఎన్ యాక్టివేషన్ జనరేషన్ ప్రక్రియలు సాధ్యమవుతాయని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో ఉమంగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, కొత్తగా యూఏఎన్ యాక్టివేట్ చేసుకోవాలి.