మందు ఎంత పని చేసింది!
అతడు అమెరికాలోని ఓ పెద్ద కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో). కానీ తాగితే ఒళ్లు తెలియదు. పూటుగా మందు తాగి రోడ్డు మీదకు వచ్చాడు. నిలబడటం వల్ల కాలేదు. ఎదురుగా కనిపించిన ఇంటిలోకి దూరి బట్టలు విప్పేసి బెడ్డు మీదకు జారుకున్నాడు.
- పూటుగా తాగి చిక్కుల్లో పడ్డ అమెరికా కంపెనీ సీఎఫ్‌వో
న్యూఢిల్లీ, నవంబర్ 8: అతడు అమెరికాలోని ఓ పెద్ద కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో). కానీ తాగితే ఒళ్లు తెలియదు. పూటుగా మందు తాగి రోడ్డు మీదకు వచ్చాడు. నిలబడటం వల్ల కాలేదు. ఎదురుగా కనిపించిన ఇంటిలోకి దూరి బట్టలు విప్పేసి బెడ్డు మీదకు జారుకున్నాడు. కాసేపటికి ఇంటి యజమానురాలు వచ్చింది. తన ఇంట్లో ఆగంతకుడు.. తన మంచం మీద ఒళ్లు తెలియకుండా నిద్రపోతున్నాడు. ఆమె వెంటనే పోలీసులకు కబురు చేసింది. పోలీసులు వచ్చి తట్టి లేపితే గురుడు సణుగుతున్నాడు కానీ లేవలేకపోతున్నాడు.
ఇది తాగుడు కేసని వారికి అర్థమైంది. టైసన్ ఫుడ్ కంపెనీ సీఎఫ్‌వో జాన్ ఆర్ టైసన్ (32) దుస్థితి ఇది. అమెరికాలో మాంసం వ్యాపారంలో దిగ్గజ కంపెనీల్లో టైసన్ ఒకటి. కంపెనీ వ్యవస్థాపకుని మునిమనుమడు ఇలా మందుబానిస కావడం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటన అమెరికాలోని అర్కన్సాస్‌లో జరిగింది. తాగి వీధుల్లోకి రావడం, వేరేవాళ్ల ఇంటిలో జొరబడటం అనే నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కంపెనీవారు దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cult Review | ‘కల్ట్’ సినిమా రివ్యూ.. విశ్వక్సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
Inter Student | అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Rise | రూ.100 చేరువలో కిలో బియ్యం..! సామాన్య ప్రజల రక్తం తాగుతున్న రైస్ మాఫియా
Soil Fertility | భూసారాన్ని కాపాడితేనే భవిష్యత్ ..వ్యవసాయానికి భరోసా
భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

