ఒక్కడి కోసం ఇద్దరు యువతుల కొట్లాట.. కాయిన్ వేసి డిసైడ్ చేసిన పంచాయితీ పెద్దలు
కాయిన్ వేసి డిసైడ్ చేసిన పంచాయితీ పెద్దలు | నేనంటే నేను పెళ్లి చేసుకుంటానంటూ వెంట పడ్డారు. ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్థంకాక.. పంచాయితీ పెద్దలను కలవడంతో పంచాయతీ పెద్దలు కూడా విచిత్రంగా తీర్పు చెప్పారు.
ఒక్క వ్యక్తి కోసం ఇద్దరు యువతులు కొట్లాడుకున్నారు. నేనంటే నేను పెళ్లి చేసుకుంటానంటూ వెంట పడ్డారు. ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్థంకాక.. పంచాయితీ పెద్దలను కలవడంతో పంచాయతీ పెద్దలు కూడా విచిత్రంగా తీర్పు చెప్పారు. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని సక్లేష్పూర్లో చోటు చేసుకుంది.

27 ఏళ్ల యువకుడు సంవత్సరం క్రితం.. తన పక్క ఊరుకు చెందిన 20 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. కట్ చేస్తే.. ఆరు నెలల కింద అదే యువకుడు.. మరో యువతితోనూ పరిచయం పెంచుకున్నాడు. ఆ యువతి కూడా అతడికి దగ్గరయింది. ఇద్దరితోనూ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు ఆ యువకుడు. అయితే.. అతడు తమను చీట్ చేస్తున్నాడని ఇద్దరిలో ఎవ్వరికీ తెలియదు.
ఒక రోజు.. ఆ యువకుడి బంధువు ఒకరు.. ఒక అమ్మాయితో ఈ యువకుడు ఉండటం చూసి.. అతడి ఫ్యామిలీకి విషయం చెప్పాడు. తన పేరెంట్స్.. యువకుడిని నిలదీయడంతో ఆ యువతిని ప్రేమించానని.. తననే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో అతడి పేరెంట్స్ ఆ యువతితో పెళ్లికి ఒప్పుకోలేదు. అతడికి వేరే పెళ్లి సంబంధం చూడటం మొదలు పెట్టారు.
ఆ యువకుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న అతడి లవర్స్లోని ఓ అమ్మాయి.. వెంటనే తన ఫ్యామిలీకి లవ్ మ్యాటర్ చెప్పింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడారు. ఇంతలోనే మరో లవర్‌కు ఈ విషయం తెలియడంతో వెంటనే అతడి ఇంటికి వెళ్లింది.

దీంతో.. ఇద్దరు యువతులను ఆ యువకుడు ప్రేమించినట్టు తెలిసి.. ఏం చేయాలో తెలియక సతమతమవుతారు యువకుడి తల్లిదండ్రులు. ఇంతలోనే ఈ ట్రయాంగిల్ లవ్ గురించి ఆ ఊరంతా బుకబుక అయింది. దీంతో ఆ ఊరి పెద్దల ముందు పంచాయితీకి వెళ్లారు. ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావని ఆ యువకుడిని ఊరి పెద్దలు అడగగానే.. నేను చేసుకుంటా అంటే నేను చేసుకుంటా.. అంటూ ఇద్దరు యువతులు అక్కడే పోట్లాడుకున్నారు. దీంతో పంచాయితీ వాయిదా పడింది.
ఇంతలో.. మొదటి యువతి సూసైడ్‌కు ప్రయత్నించడంతో మరోసారి పంచాయితీ పెద్దలు వాళ్లను పిలిచి.. వాళ్లతో అగ్రిమెంట్ రాయించుకొని.. కాయిన్ వేసి ఇద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేశారట. ఈ టాస్‌లో మొదటి లవర్ గెలవడంతో.. తననే ఆ యువకుడు పెళ్లి చేసుకున్నాడట. ఇక.. రెండో యువతి.. ఆ యువకుడిని చెంపపై కొట్టి.. తన కన్నా మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని సవాల్ విసిరి అక్కడి నుంచి వెళ్లిపోయిందట. అలా.. ట్రయాంగిల్ లవ్ స్టోరీని శుభం కార్డు పడిందట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Little Survivor : మూడేళ్ల బాలుడు.. అడవిలో తప్పిపోయి.. మూడు రోజులు అక్కడే ఉండి.. చివరకు?
Bald Fest : అక్కడికి బట్టతల ఉంటేనే ఎంట్రీ.. బట్టతల ఫెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే?
Costly Cottage : ఏమీ లేని ఈ కాటేజ్‌కు రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

