కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 19: భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
కొడలియార్ గ్రామ సమీప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐటీబీపీ 53వ బెటాలియన్‌లో ఉన్న మహారాష్ట్ల్రకు చెందిన అమర పన్వార్ (36), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపకు చెందిన కే.రాజేశ్ (36) మృతిచెందారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.