జైపూర్, డిసెంబర్ 18: రాజస్థాన్ బికనీర్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో బుధవారం శిక్షణలో భాగంగా యుద్ధ ట్యాంకులో మందుగుండు లోడ్ చేస్తున్న సందర్భంగా పేలుడు సంభవించి ఇద్దరు సైనికులు మరణించారు. మరో సైనికుడు గాయపడ్డాడు.
ఈ వారంలో ఈ తరహా ఘటన జరగడం ఇది రెండవసారి. మందుగుండు లోడ్ చేస్తుండగా చార్జర్ పేలిపోయిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ అబితాబ్ శర్మ విలేకరులకు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మరణిచంగా మరో సైనికుడు గాయపడ్డాడని చెప్పారు. గత ఆదివారం బికనీర్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో గన్‌కు గన్ను తగిలిస్తుండగా వాహనం హఠాత్తుగా వెనుకకు వాలిపోయి చంద్ర ప్రకాష్ పటేల్ అనే గన్నర్ మరణించాడు.