న్యూఢిల్లీ, జూలై 28: రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలో మిగ్-21 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు భారత వాయుసేన ధ్రువీకరించింది. రాజస్థాన్‌లోని ఉతల్రాయ్ ఎయిర్‌బేస్ నుంచి సాయంత్రం ఈ శిక్షణ విమానం బయల్దేరింది.
పైలట్ల మృతిపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విచారం వ్యక్తంచేశారు. వాయుసేన చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరితో ఫోన్లో మాట్లాడిన మంత్రి ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్టు వాయుసేన తెలిపింది.