H3N2 Influenza Virus | హాంకాంగ్ ఫ్లూ డేంజర్ బెల్స్.. H3N2 వైరస్ బారినపడి ఇద్దరు మృతి
H3N2 Influenza Virus | దేశంలో హాంగ్కాంగ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. H3N2 వైరస్ కారణంగా సోకే ఇన్ఫ్లూయెంజానే (ఫ్లూ జ్వరం) హాంగ్కాంగ్ ఫ్లూ అని కూడా అంటారు. ఈ ఫ్లూ జ్వరం సోకి దేశంలో తాజాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీ: దేశంలో హాంగ్కాంగ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. H3N2 వైరస్ కారణంగా సోకే ఇన్ఫ్లూయెంజానే (ఫ్లూ జ్వరం) హాంగ్కాంగ్ ఫ్లూ అని కూడా అంటారు. ఈ ఫ్లూ జ్వరం సోకి దేశంలో తాజాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరు హర్యానా రాష్ట్రానికి చెందినవారు కాగా, మరొకరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 90 H3N2 వైరస్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఎనిమిది H1N1 వైరస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల దేశమంతటా ఫ్లూ జ్వరాలు పెరిగిపోతున్నాయి. అందులో H3N2 వైరస్ కారణంగా వచ్చే ఫ్లూ జ్వరాలే ఎక్కువగా ఉన్నాయి.
ప్రాణాంతకమైన ఈ ఫ్లూ సోకిన వారిలో జ్వరం, చలి, దగ్గు, శ్వాస కష్టంగా ఉండటం, గురక లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పై లక్షణాలతోపాటే వాంతి వచ్చినట్లుగా అనిపించడం, గొంతులో గరగర, ఒంటి నొప్పులు, డయేరియా లక్షణాలు కూడా వేధిస్తాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

