శాన్ఫ్రాన్సిస్కో, జూన్ 29: ట్విట్టర్ తన యూజర్ల కోసం రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రముఖంగా రచయితల కోసం టెక్ట్స్ ఫార్మాటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత విస్తరించేందుకు ఒక్కో ట్వీట్ గరిష్ఠ అక్షరాల పరిమితిని 25 వేలకు పెంచింది. అలాగే, నాలుగు ఇన్లైన్ ఇమేజ్‌లను జోడించే అవకాశం కల్పించింది. అయితే, ఈ ఫీచర్లను పొందాలంటే బ్లూ ట్రిక్ సబ్స్క్రిప్షన్ తప్పనిసరని వెల్లడించింది. ట్విట్టర్‌ను ఎలాన్‌మస్క్ చేజిక్కించుకొన్నాక ట్వీట్ చేసే గరిష్ఠ అక్షరాల పరిమితిని పెంచడం ఇది మూడోసారి.