రెవా: మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలో ఇద్దరు మైనర్లపై సామూహిక అత్యాచారం(Gang Rape) జరిగింది. గ్యాంగ్ రేప్‌కు చెందిన వీడియో ఒకటి వైరల్ కావడంతో.. ఆ ఘటనపై పోలీసులు కేసు బుక్ చేశారు. ఆ ఘటనతో లింకు ఉన్న ఐదుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. హనుమానా పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో 25 రోజుల క్రితం అత్యాచారం జరిగింది. అయితే ఆ ఘటనకు చెందిన వీడియో ఆదివారం వైరల్ అయ్యింది. 14, 16 ఏండ్లు ఉన్న ఇద్దరు మైనర్లపై గ్యాంగ్ రేప్ జరిగింది. మేకలను మేపేందుకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి ఆ ఇద్దరు అమ్మాయిలు వెళ్లారు.
అయితే అక్కడ తిరుగుతున్న కొందరు వ్యక్తులకు ఆ మైనర్లను రేప్ చేశారు. ఆ ఘటనను వీడియో కూడా తీశారు. ఎవరికైనా ఈ విషయం చెబితే వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. సోమవారం కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు బుక్ చేశారు. అయిదుగుర్ని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఐపీసీ, పోక్సో చట్టాల కింద కేసును రిజిస్టర్ చేశారు.