అహ్మదాబాద్: అటవీ ప్రాంతం సమీపంలోని మార్గంలో కొందరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. రెండు సింహాలు అక్కడ ఉండటం చూసి కొంతదూరంలో వారు ఆగిపోయారు. వాటిని చూసి ఇద్దరు వ్యక్తులు దూరంగా పారిపోయారు. (Lions Walk Towards Biker) బైక్ నడిపే వ్యక్తి అక్కడ ఉండటాన్ని సింహాలు గమనించాయి. మెల్లగా నడిచి అతడి వద్దకు వెళ్లాయి. భయపడిన ఆ వ్యక్తి కూడా బైక్ దిగి పక్కనున్న పొదల్లోకి వెళ్లాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. మట్టి రోడ్డులో రెండు సింహాలను చూసి వారు దూరంగా ఆగిపోయారు. భయందోళన చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, ఒక వ్యక్తి మాత్రం బైక్‌పై అక్కడే ఉన్నాడు. ఇది చూసి సింహాలు అతడి వద్దకు మెల్లగా వెళ్లసాగాయి. దీంతో అతడు కూడా భయపడ్డాడు. బైక్ పార్క్ చేసి పక్కనున్న పొదల్లోకి వెళ్లాడు. ఆ తర్వాత ఆ సింహాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
మరోవైపు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘గుజరాత్లో మరో రోజు’ అని క్యాప్షన్ ఇచ్చారు. ‘మనిషిని ఆహారంగా తీసుకునేందుకు సింహాల జంట ఆసక్తి చూపలేదు. లేకపోతే అవి వారిని వెంబడించి వేటాడి ఉండేవి’ అని పేర్కొన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.
Another day in Gujurat😃
The lion pair is just not interested in human as its prey. Otherwise, it could have easily outpaced the running bikers. pic.twitter.com/Rogc1ydJGx— Susanta Nanda (@susantananda3) March 16, 2025