ఉత్తరప్రదేశ్‌లోని లక్నో పబ్‌లో ఓ వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న యువతులు చితకబాదారు. ఈ ఘటన అన్ప్లగ్డ్ కేఫ్ వెలుపల అర్థరాత్రి జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఆ భవనంలోని 15వ అంతస్తులో ఉన్న పబ్ వెలుపల ఒక యువతి..ఓ వ్యక్తిపై దాడిచేసింది. పూలకుండీతో అతడిని కొట్టింది. అతడితో ముష్టియుద్ధం చేసింది. ఈ వీడియో ఆన్లైన్లో వైలర్ అవుతోంది.
ఈ సంఘటన విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమ్మిట్ బిల్డింగ్‌లో జరిగింది. పబ్‌లోని బౌన్సర్లు, ఇతర నిర్వాహకులు అడ్డుకునేంతవరకూ యువతి తన స్నేహితురాలితోకలిసి ఆ వ్యక్తిని కొడుతూనే ఉంది. వీడియోలో ఉన్న ఇద్దరు మహిళలను గుర్తించిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, కొట్టిన వ్యక్తి ఫిర్యాదు చేయడానికి రాలేదని పోలీసులు తెలిపారు.
लखनऊ अनप्लग्ड कैफे के बाहर चले लात-घूंसे, लड़की ने एक शख्स को जमकर पीटा #Video Viral #Lucknow #UnpluggedCafe @Live_Hindustan pic.twitter.com/r8Ks3cVQAI
— Hindustan UP-Bihar (@HindustanUPBH) July 22, 2022