పుణె, అక్టోబర్ 22: పుణెలో ఒక ప్రైవేట్ శిక్షణ విమానం కూలిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. రెడ్‌బర్డ్ ఫ్లయిట్ ట్రైనింగ్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం మహారాష్ట్రలోని పుణె జిల్లా గోజుబావి గ్రామం వద్ద ఆదివారం ఉదయం 8 గంటలకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్, శిక్షకుడు గాయపడ్డారు. వెంటనే వారిద్దరినీ దగ్గరలోని దవాఖానకు తరలించినట్టు బారామతి పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ మోరె తెలిపారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రైవేట్ శిక్షణ విమానం ఇలా కూలడం గత నాలుగు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గురువారం కూడా ఒక శిక్షణ విమానం కూలింది. ఈ ప్రమాదంలో పైలట్ గాయపడ్డారు.