Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Conrad Star Hotel: బెంగుళూరులోని కాన్రాడ్ ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో శుక్రవారం సాయంత్రం ఎలక్ట్రిక్ షాక్ వల్ల ఇద్దరు విదేశీయులు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. హోటల్ మూడో అంతస్తులో పూల్ ఉన్నది.
బెంగుళూరు: బెంగుళూరులో విషాద ఘటన జరిగింది. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న ఇద్దరు విదేశీయులు ఎలక్ట్రిక్ షాక్ తగిలి మృతిచెందారు. నగరంలోని కాన్రాడ్ ఫైవ్ స్టార్ హోటల్(Conrad Star Hotel) పూల్‌లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకున్నది. బాధితులను జర్మనీ, స్లోవేకియా దేశస్థులిగా గుర్తించారు. ఆ ఇద్దరు ఆ హోటల్లోనే బస చేస్తున్నారు. ఆ ఇద్దర్నీ రక్షించే క్రమంలో మరో ఇద్దరికీ గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిలో అమెరికా దేశస్థుడు ఒకరు కాగా, పూల్ అటెండెంట్ ఉన్నారు.
జర్మనీ దేశస్థుడిని 57 ఏళ్ల అలెగ్జాండర్ మాక్సిమిల్లన్ థీసీస్గా గుర్తించారు. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌లో అతను సిబ్బందిగా చేస్తున్నాడు. ప్రాణాలు కోల్పోయిన స్లోవేకియా దేశస్థుడిని 45 ఏళ్ల జురాజ్ హోర్వట్గా తేల్చారు. ఐబీఎం టెక్ కంపెనీలో అతను ప్రాజెక్టు మేనేజర్‌గా చేస్తున్నాడు. హోటల్ మూడవ ఫ్లోర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో ఈ ఘటన జరిగింది. గాయపడ్డవారిని మాథ్యూ డిసాంటిస్, రాహుల్ తివారీగా గుర్తించారు. మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హోటల్ యాజమాన్యం దీనిపై ఇంకా ప్రకటన చేయలేదు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 వరకు స్విమ్మింగ్ పూల్‌ను మెయింటేనెన్స్ కోసం మూసివేస్తున్నట్లు హోటల్ వెబ్సైట్లో పేర్కొన్నారు. కాన్రాడ్ ఫైవ్ స్టార్ హోటల్ 24 అంతస్తులు ఉన్నది. హిల్టన్ గ్రూపులో ఈ హోటల్ భాగస్వామ్యం. ఆ హోటల్లో ఒక రోజు రూం రేటు 25వేలుగా ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

