బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని కాంగ్రెస్ మండ్య ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ సోమవారం ఆరోపించారు. కిత్తూరు ఎమ్మెల్యే బాబా సాహెబ్ డీ పాటిల్, చిక్కమగళూరు ఎమ్మెల్యే హెచ్డీ తమ్మయ్యను బీజేపీ సంప్రదించిందన్నారు. తన ఆరోపణలను రుజువు చేయడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని చె ప్పారు.
ఈ ఎమ్మెల్యేలు స్పందిస్తూ, తమను బీజేపీ కానీ, ఇతరులు కానీ సంప్రదించలేదని, సొమ్ము ఇస్తామని ఆశపెట్టలేదని వివరణ ఇచ్చారు. బీజేపీ స్పందిస్తూ, ఈ ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరింది. సీఎం సిద్ధరామయ్య కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. తమ ఎమ్మెల్యేలకు 50 కోట్ల చొప్పున బీజేపీ ఆఫర్ చేస్తున్నదని, తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు.