న్యూఢిల్లీ: పార్లమెంట్లో గందరగోళం నెలకొన్నది. అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన చేపట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ.. బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్‌లోని మకర ద్వారం వద్ద .. ఇండియా కూటమి, బీజేపీ ఎంపీలు ఎదురుపడ్డారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. ఆ ఘర్షణలో బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారు.
#WATCH | MPs of INDIA bloc and BJP came to face at the Parliament premises earlier today while carrying out their respective protests over Dr BR Ambedkar.
INDIA MPs are demanding an apology and resignation of Union Home Minister Amit Shah over his remarks on Babasaheb Ambedkar… pic.twitter.com/IhryQTbKoQ
— ANI (@ANI) December 19, 2024
బీజేపీ ఎంపీలు తనను నెట్టివేశారని, పార్లమెంట్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కానీ రాహుల్ గాంధీ తోయడం వల్లే ఎంపీలకు గాయమైనట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ఎంపీ ముకేశ్ రాజ్‌పుత్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన కండీషన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
मैं संसद के अंदर जाने की कोशिश कर रहा था।
लेकिन BJP के सांसद मुझे रोकने की कोशिश कर रहे थे, धक्का दे रहे थे और धमका रहे थे।
ये संसद है और अंदर जाना हमारा अधिकार है।
: नेता विपक्ष श्री @RahulGandhi pic.twitter.com/wfwAGAeruf
— Congress (@INCIndia) December 19, 2024
రాహుల్‌గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని, ఆ ఎంపీ తనపై పడిపోయారని, దాంతో తాను కింద పడిపోయినట్లు బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగీ తెలిపారు. రాహుల్ గాంధీ ఎంపీని తోసివేసిన సమయంలో తాను మెట్ల వద్ద నిలుచుకున్నట్లు చెప్పారు. ఉభయ సభలను ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
Delhi | BJP MP Mukesh Rajput also got injured. His condition is serious and he has been admitted to the ICU of RML hospital https://t.co/q1RSr2BWqu
— ANI (@ANI) December 19, 2024