ట్విటర్ అనూహ్య నిర్ణయం.. వెంకయ్యనాయుడు అకౌంట్ నుంచి బ్లూ టిక్ ఔట్

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్ శనివారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత అకౌంట్ నుంచి బ్లూ టిక్ లేదా వెరిఫైడ్ బ్యాడ్జ్‌ను తొలగించింది. ఆరు నెలలకుపైగా ఈ అకౌంట్ (@MVenkaiahNaidu) ఇన్‌యాక్టివ్‌గా ఉండటం వల్లే ట్విటర్ ఈ నిర్ణయం తీసుకున్నదని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. ఉపరాష్ట్రపతి అధికారిక అకౌంట్ @VPSecretariatకు మాత్రం బ్లూటిక్ అలాగే ఉంది.
అయితే ఆయన వ్యక్తిగత అకౌంట్‌కు వెరిఫైడ్ స్టేటస్ తీసేయడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ట్విటర్ తిరిగి బ్లూటిక్ ఇవ్వనున్నట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ఈ అకౌంట్ నుంచి వెంకయ్యనాయుడు చివరిసారి 2020, జులై 23న ట్వీట్ చేశారు. ట్విటర్ ఇచ్చే ఈ బ్లూటిక్ లేదా వెరిఫైడ్ బ్యాడ్జ్ వల్ల ఇది అధికారిక, గుర్తింపు పొందిన, యాక్టివ్‌గా ఉన్న అకౌంట్‌గా ధృవీకరించుకోవచ్చు. ప్రముఖ వ్యక్తులు, బ్రాండ్లకు మాత్రమే ట్విటర్ ఈ గుర్తింపు ఇస్తుంది.
వెంకయ్య ఖాతాకు బ్లూటిక్ రీస్టోర్ చేసిన ట్విటర్
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అకౌంట్‌కు బ్లూటిక్ రీస్టోర్ చేసింది ట్విటర్. దానిని తొలగించిన గంటల వ్యవధిలోనే ఈ మైక్రోబ్లాగింగ్ సంస్థ రీస్టోర్ చేయడం గమనార్హం. గతేడాది జులై నుంచి ఈ అకౌంట్ ఇన్‌యాక్టివ్‌గా ఉందంటూ శనివారం ఉదయం వెరిఫైడ్ అకౌంట్‌ను సూచించే బ్లూటిక్‌ను ట్విటర్ తొలగించింది. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్విటర్ దిగి వచ్చింది. ఈ మధ్య తన అధికారిక ఖాతాను ఆయన ఎక్కువగా వినియోగిస్తుండటంతో వ్యక్తిగత ఖాతా ఇన్‌యాక్టివ్‌గా ఉన్నదని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.
వెంకయ్యనాయుడు ట్విటర్ అకౌంట్‌కు బ్లూటిక్ తీసేయడాన్ని కొందరు ట్విటరర్లు ప్రశ్నించారు. ఎన్నో ఖాతాలు ఏడాదికిపైగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్నా.. వాటికి బ్లూటిక్ కొనసాగడాన్ని గుర్తు చేశారు. అటు బీజేపీ నేత సురేశ్ నకువా కూడా దీనిపై విమర్శలు గుప్పించారు. ఇది భారత రాజ్యాంగంపై జరిగిన దాడి అని ఆయన అనడం విశేషం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
చండ్రుగొండలో నీట మునిగిన పంట పొలాలు
BJP leader’s son dies by suicide | బీజేపీ నేత కుమారుడు ఆత్మహత్య.. భార్య వేధింపులపై వీడియో
విద్యార్థులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి : శశిధర్ శర్మ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

