లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సంచలనం రేపిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ హత్య కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. (Meerut Murder Case) భార్య ముస్కాన్, ప్రియుడు సాహిల్ కలిసి కత్తితో పొడిచి ఆమె భర్త సౌరభ్‌ను మార్చి 4న హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికారు. పెద్ద డ్రమ్ములో వాటిని ఉంచి సిమ్మెంట్‌తో నింపారు. భర్త హత్య తర్వాత ప్రియుడు సాహిల్‌తో కలిసి ముస్కాన్ ఎంజాయ్ చేసింది. మార్చి 14న హోలీని వారిద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. రంగులు పూసుకుని డ్యాన్స్ చేశారు. సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, భర్త హత్య తర్వాత ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ సిమ్లా వెళ్లారు. అక్కడ అతడి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. సాహిల్ కోసం బర్త్ డే కేక్ తీసుకురావాలని క్యాబ్ డ్రైవర్‌కు వాట్సాప్ వాయిస్ పంపింది. కేక్ సిద్ధమైన తర్వాత తనకు కాల్ చేయవద్దని, మెసేజ్ ద్వారా తెలియజేయాలని అందులో చెప్పింది. ముస్కాన్ మొబైల్ ఫోన్ నుంచి ఈ వాట్సాప్ వాయిస్‌ను పోలీసులు రికవరీ చేశారు.
మరోవైపు ముస్కాన్ బాలీవుడ్ ఆకాంక్షలు, భారీగా ఆర్థిక లావాదేవీలతోపాటు క్షుద్రపూజలు సౌరభ్ హత్యకు కారణాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సౌరభ్‌ను నరికిన తర్వాత అతడి తల, చేతులను సాహిల్ తన బెడ్ రూమ్‌లోకి తీసుకెళ్లి క్షద్రపూజలు చేసినట్లు కొన్ని ఆధారాలు పోలీసులకు లభించాయి.
అలాగే ముస్కాన్, ఆమె తల్లి బ్యాంకు ఖాతాలకు ఆరు లక్షలను సౌరభ్ ట్రాన్స్ఫర్ చేసినట్లు పోలీసులకు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు, ముస్కాన్ కుటుంబం ఆర్థిక సమస్యలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, క్షుద్రపూజలు చేసే సాహిల్ తన కుమార్తె ముస్కాన్‌ను పూర్తిగా వశపర్చుకున్నాడని ఆమె తల్లి ఆరోపించింది. మద్యం, డ్రగ్స్‌కు బానిసగా చేయడంతోపాటు కూతుర్ని వదిలేసి చివరకు భర్తను హత్య చేసేలా ఆమెను ప్రేరేపించాడని మీడియాకు వెల్లడించింది.
मेरठ : सौरभ राजपूत का कत्ल करने के बाद पत्नी मुस्कान रस्तौगी ने बॉयफ्रेंड साहिल शुक्ला के साथ होली खेली। Video देखिए… pic.twitter.com/586m3K3Sx3
— Sachin Gupta (@SachinGuptaUP) March 21, 2025