TVK Vijay : తమిళనాడులో అధికార డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ అన్నారు. బీజేపీ డబ్బా ఇంజిన్ అయితే, డీఎంకే రిపేర్ ఇంజిన్ అన్నారు. తమ టీవీకే పార్టీయే టాప్ ఇంజిన్ అంటూ చెప్పుకొచ్చారు. పార్టీ మూడో వార్షికోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన సమావేశంలో విజయ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా తమ పార్టీ తమిళుల కన్నీళ్లు తుడుస్తుందని విజయ్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో విజయ్ మాట్లాడారు. ‘‘అప్పట్లో ప్రజల కన్నీళ్లు తుడిచేందుకే నటుడు ఎంజీఆర్.. ఏఐఏడీఎంకేను స్థాపించారు. ఇప్పుడు మళ్లీ ప్రజలు కన్నీళ్లలో ఉన్నారు. మేం కూడా ప్రజల కన్నీళ్లు తుడుస్తాం. అన్నీ పొత్తులో ఉండే పార్టీలే. తమిళనాడులో డీఎంకేను అడ్డుకునే సత్తా ఒక్క టీవీకేకు మాత్రమే ఉంది. మూడు లేదా నాలుగు ఫ్రంట్లు ఏర్పడ్డా టీవీకే విజయం సాధిస్తుంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఎంజీఆర్‌ను అవమానించారు. అది కొందరు చేసే పని. మమల్ని విమర్శించినా వాళ్లను విమర్శించినట్లే. మేం డీఎంకే ప్రశ్నిస్తాం. వ్యతిరేకిస్తాం. టీవీకేకు ఒంటరిగానే గెలిచే సత్తా ఉంది’’ అని విజయ్ అన్నారు.
తమిళనాడులో వచ్చే ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పోటీలో టీవీకే ఒంటరిగా వెళ్తుందా లేక పొత్తుతో వెళ్తుందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఏఐఏడీఎంకేతో పొత్తు కోసం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే విజయ్.. ఆ పార్టీపై పెద్దగా విమర్శలు చేయడం లేదు. బీజేపీ, డీఎంకేపై మాత్రమే విమర్శలు చేస్తున్నారు.