చెన్నై: తమిళగ వెట్రి కగజం(TVK ) సంచలనం సృష్టిస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ వైపు పయనిస్తున్నాయి. ఇవాళ జరుగుతున్న కౌంటింగ్‌లో అనూహ్య రీతిలో టీవీకే దూసుకెళ్తున్నది. తాజా సమాచారం ప్రకారం హీరో విజయ్‌కు చెందిన ఆ పార్టీ 103 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. వంద మార్క్‌ను దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో టీవీకే పార్టీ.. గెలచే ఎమ్మెల్యేల కోసం అప్పుడే రిసార్ట్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు.. కొత్త ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లే అవకాశాలు ఉన్న నేపథ్యంలో టీవీకే రిసార్ట్ రాజకీయాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మల్లాపురంలో ఉన్న పుంజేరి ప్రైవేటు రిసార్ట్‌ను టీవీకే వంద ఎమ్మెల్యేల కోసం బుక్ చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. ఎడప్పాడిలోని ఇండిపెండెంట్ అభ్యర్థికి మాత్రమే ఆ పార్టీ సపోర్టు ఇచ్చింది. ప్రస్తుతం వెలుబడుతున్న తాజా ఫలితాల నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్ను అప్రమత్తం చేశారు. వంద స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న సందర్భంగా.. తమ ఎమ్మెల్యేలను సురక్షితంగా ఉంచుకోవాలని టీవీకే రిసార్టు బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అభ్యర్థులతో విజయ మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేలతో అదవ అర్జున కోఆర్డినేట్ చేస్తున్నారు.