ఆదివారం 12 జూలై 2020
National - Jun 28, 2020 , 13:35:48

క‌రోనాతో టీవీ జ‌ర్న‌లిస్టు మృతి

క‌రోనాతో టీవీ జ‌ర్న‌లిస్టు మృతి

చెన్నై : త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. త‌మిళ్ న్యూస్ ఛానెల్ లో ప‌ని చేస్తున్న సీనియ‌ర్ వీడియో గ్రాఫ‌ర్.. క‌రోనాతో చికిత్స పొందుతూ రాజీవ్ గాంధీ గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్ లో శ‌నివారం రాత్రి క‌న్నుమూశాడు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న వీడియో జ‌ర్న‌లిస్టు జూన్ 14న ఆస్ప‌త్రిలో చేరాడు. జ‌ర్న‌లిస్టు మృతి ప‌ట్ల త‌మిళ‌నాడు సీఎం కే ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎం ప‌న్నీరుసెల్వం, డీఎంకే అధ్య‌క్షుడు ఎంకే స్టాలిన్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు, స‌హోద్యోగులు సంతాపం ప్ర‌క‌టించారు. 

మృతుడి కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా సీఎం ప‌ళ‌నిస్వామి ప్ర‌క‌టించారు. జ‌ర్న‌లిస్టుకు భార్య‌, కుమారుడు ఉన్నారు. అయితే భార్య ష‌ణ్ముగ‌సుంద‌రి రాజీవ్ గాంధీ గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిలో కాంట్రాక్టు ప్ర‌తిపాదిక‌న న‌ర్సుగా ప‌ని చేస్తున్నారు. ఆమె ఉద్యోగాన్ని క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది. ఆరోగ్య శాఖ మంత్రి సి విజ‌య‌భాస్క‌ర్, మ‌త్స్య శాఖ మంత్రి డి జ‌య‌కుమార్, స‌మాచార శాఖ మంత్రి కాదంబూర్ క‌లిసి రూ. 50 వేల చొప్పున జ‌ర్న‌లిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. 


logo