శ్రీహరికోట: గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఇవాళ జరగాల్సిన క్రూ మాడ్యూల్ పరీక్ష వాయిదా పడింది. టీవీ-డీ1 ప్రయోగంలో సాంకేతిక లోపం తలెత్తింది. రాకెట్ ఇంజిన్‌లో ఇగ్నిషన్ లోపం వచ్చినట్లు ఇస్రో వెల్లడించింది. ఇంజిన్ మండకపోవడం వల్ల అనుకున్న సమయానికి గగన్‌యాన్ మాడ్యూల్ పరీక్షను వాయిదా వేశారు. అయితే ఆ పరీక్షను మళ్లీ ఎప్పుడు చేపడుతామన్న దానిపై త్వరలో ప్రకటన చేస్తామని ఇస్రో చైర్మెన్ సోమనాథ్ తెలిపారు. ఇవాళ ఉదయం 10 గంటలకు మళ్లీ ఫ్లయిట్ టెస్ట్ నిర్వహించనున్నారు.
Reason for the launch hold is identified and corrected.
The launch is planned at 10:00 Hrs. today.
— ISRO (@isro) October 21, 2023
తొలుత వెదర్ సరిగా లేని కారణంగా టీవీ-డీ1 ప్రయోగాన్ని 8.45 నిమిషాలకు వాయిదా వేశారు. అయితే ఆటోమెటిక్ లాంచ్ సీక్వెన్స్‌లో లోపం తలెత్తింది. దీంతో 5 సెకన్ల ముందు పరీక్షను రద్దు చేశారు. ఇంజిన్ ఇగ్నిషన్ నార్మల్‌గా జరగలేదని సోమనాథ్ వెల్లడించారు.
TV D1 Test Flight
Liftoff attempt couldn’t be completed.
Updates will follow.
— ISRO (@isro) October 21, 2023
ఎక్కడ పొరపాటు జరిగిందో పరీక్షించనున్నట్లు ఆయన తెలిపారు. కానీ వెహికల్ మాత్రం సేఫ్‌గా ఉందని సోమనాథ్ చెప్పారు. ఆటోమెటిక్ లాంచ్ సీక్వెన్స్ ఎందుకు ఆగిందో విశ్లేషించనున్నట్లు ఆయన తెలిపారు. విశ్లేషణ పూర్తి అయిన తర్వాత మళ్లీ ప్రయోగ సమయాన్ని ప్రకటించనున్నట్లు సోమనాథ్ చెప్పారు. ఆటోమెటిక్ సీక్వెన్స్‌లో లోపం ఉన్నట్లు కంప్యూటర్ గుర్తించిందని, దీంతో లాంచింగ్‌ను వాయిదా వేసామన్నారు. తొలుత టీవీ-డీ1 మాడ్యూల్‌ను ఉదయం 8 గంటలకు ప్రయోగించాల్సి ఉంది. అయితే వాతావరణం సరిగా లేని కారణంగా ఆ ప్రయోగాన్ని 8.45 నిమిషాలకు వాయిదా వేశారు.
#WATCH | Gaganyaan’s First Flight Test Vehicle Abort Mission-1 (TV-D1) launch put on hold at 5 seconds pic.twitter.com/ygOkpdaUx3
— ANI (@ANI) October 21, 2023