న్యూఢిల్లీ, మే 15: ఢిల్లీ, ముంబైతో పాటు దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, భద్రతాపరమైన, ఇతర విధులు నిర్వహిస్తున్న తుర్కియేకు చెందిన సెలెబీ ఎయిర్‌పోర్టు సర్వీసెస్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం భద్రతా అనుమతిని రద్దు చేసింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) జాయింట్ డైరెక్టర్ సునీల్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.
దేశ భద్రతా కారణాలతోఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పా రు. సెలెబీ దేశంలోని ఢిల్లీ, ముంబైతో పాటు హైదరాబాద్, కొచ్చి, చెన్నై ఎయిర్‌పోర్టులలో గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో, గ్రౌండ్ ఆపరేషన్ వంటి ముఖ్యమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.