ముంబై: టీవీ సీరియల్లలో నటించే యువ నటి తునిషా శర్మ (21) మృతి కేసుకు సంబంధించి రోజురోజుకు కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రేమ పేరుతో మోసం చేసి, ఆమె సహ నటుడు షీజాన్ ఖానే తునిషాను ఆత్మహత్యకు పురికొల్పాడన్న ఆరోపణల నేపథ్యంలో ఘటన జరిగిన మరుసటిరోజే పోలీసులు షీజాన్ను అరెస్ట్ చేశారు. అతనిపై పోలీస్ ఇంటరాగేషన్ ముగియడంతో కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం షీజాన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
షీజాన్ తమ బిడ్డను మోసం చేశాడని తునిషా తల్లి ఆరోపించింది. అతడికి శిక్షపడేవరకు విడిచిపెట్టనని ప్రతిజ్ఞ కూడా చేసింది. ఈ క్రమంలో షీజాన్ కుటుంబసభ్యులు, వారి తరఫు న్యాయవాది కలిసి ప్రెస్మీట్ పెట్టారు. కేసుకు సంబంధించి మరికొన్ని కొత్త విషయాలను వెల్లడించారు. తునిషా శర్మ సంపాదనపై ఆమె అంకుల్ సంజయ్ కౌశల్, తల్లి వనితా శర్మ అజయాయిషీ చేసేవారని ఆరోపించారు.
అందుకే సంజయ్ కౌశల్ పేరు వింటేనే తునిషా శర్మ భయంతో గడగడ వణికిపోయేదని షీజాన్ కుటుంబసభ్యులు, న్యాయవాది చెప్పారు. తునిషాకు డబ్బు అవసరమైతే తన తల్లి దగ్గర చేయి చాచాల్సి వచ్చేదని, తన సంపాదనపై తనకే హక్కు ఉండేది కాదని తెలిపారు. అటు తునిషాతో షీజాన్ బలవంతంగా హిజాబ్ ధరింపజేశాడన్న ఆరోపణలపై కూడా వారు స్పందించారు.
తునిషాతో షీజాన్ బలవంతంగా హిజాబ్ ధరింపజేశాడని ఇటీవల తునిషా తల్లి ఆరోపించింది. అనంతరం తునిషా శర్మ హిజాబ్ ధరించి ఉన్న ఫొటో ఒక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, షీజాన్ హిజాబ్ ధరింపజేశాడని జరుగుతున్న ప్రచారం అబద్ధమని షీజాన్ సోదరి షఫాక్ నాజ్ చెప్పారు. ఓ సీరియల్ షూటింగ్ కోసం తునిషా హిజాబ్ ధరించి వున్న ఫొటోతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు.
Tunisha Sharma death case | Tunisha & Sanjeev Kaushal (an uncle in Chandigarh) had terrible relations. Sanjeev Kaushal & her mother, Vanita used to control Tunisha’s finances. Tunisha often pleaded in front of her mother for her own money: Sheezan Khan’s advocate pic.twitter.com/mODql3cwlA
— ANI (@ANI) January 2, 2023