లక్నో: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, రైతుల నిరసనపై చేసిన వ్యాఖ్యలపై రైతు సంఘాలు మండిపడ్డాయి. ఆమె దిష్టి బొమ్మతో నిరసన చేసేందుకు ప్రయత్నించారు. (Kangana Ranaut’s Effigy) అయితే పోలీసులు ఆ దిష్టి బొమ్మను లాక్కోవడంతో ఇరు వర్గాల మధ్య పెనుగులాట జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. రైతులపై కంగనా రనౌత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ (లోఖిత్) జాయింట్ కిసాన్ మోర్చా సభ్యులు ఆమె దిష్టి బొమ్మతో నిరసన తెలిపి దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే కారు నుంచి బయటకు తీసిన దిష్టి బొమ్మను పోలీసులు లాక్కున్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు, పోలీసుల మధ్య పెనుగులాట జరిగింది.
కాగా, పోలీసుల తీరుపై రైతు నాయకులు మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
పోలీసులు లాక్కొన్న కంగనా దిష్టి బొమ్మను తిరిగి ఇవ్వాలని పట్టుబట్టారు. అలాగే రైతులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఆమెపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మరో దిష్టి బొమ్మతో నిరసన కొనసాగించారు. ఈ నేపథ్యంలో హాపూర్‌లోని ఢిల్లీ-లక్నో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు దిష్టి బొమ్మ కోసం రైతులు, పోలీసుల మధ్య జరిగిన పెనుగులాట వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Hapur :
हापुड़ में कंगना का किसानों ने दूसरा पुतला तैयार कर फुकने का किया प्रयास, पुलिस और किसानों की हुई पुतले को लेकर छिनाझपटी, पुलिसकर्मी दूसरा पुतला किसानों से छीनकर भागे. @hapurpolice @KanganaTeam #Hapur #KanganaRanaut #HapurPolice pic.twitter.com/CTr1rRmFUr
— Tricity Today (@tricitytoday) August 28, 2024