లక్నో: అమెరికా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రిజర్వేషన్లపై చేసిన ప్రకటనపై బీజేపీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు దానిని లాక్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య తోపులాట జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా రిజర్వేషన్లపై చేసిన ప్రకటనకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు శుక్రవారం పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు.
కాగా, పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య పెనుగులాట, తోపులాట జరిగింది. చివరకు దిష్టి బొమ్మ పీలికలను పోలీసులు, బీజేపీ కార్యకర్తలు చేత పట్టుకుని పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Hapur: बीजेपी सांसद भोला सिंह के नेतृत्व में राहुल गांधी द्वारा अमेरिका में आरक्षण को लेकर दिए बयान के विरोध में पैदल मार्च निकाला।सांसद और विधायक की मौजूदगी में राहुल गांधी के पुतले कोफूंकने से पहली ही पुलिस कार्यकर्ताओं से पुतला छीनकर कर भाग गई।
सांसद और विधायक देखते रह गए. pic.twitter.com/jKqFGfShV4— Adnan ( journalist) (@hapurndtv) September 27, 2024