లక్నో: రైలులో టికెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తిని టీటీఈ అసభ్యకరంగా తిట్టాడు. అంతేగాక అతడి చెంపపై పదేపదే కొట్టాడు. (TTE Slaps Passenger) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో టీటీఈపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ టీటీఈని సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి టికెట్ లేకుండా బరౌనీ-లక్నో ఎక్స్ప్రెస్లో ప్రయాణించాడు. టికెట్లు తనిఖీ చేసే టీటీఈ ఈ విషయాన్ని గుర్తించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని దారుణంగా తిట్టడంతోపాటు అతడి చెంపపై పలుమార్లు కొట్టాడు.
కాగా, ఆ రైలులో ప్రయాణించిన కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో దీనిని రికార్డ్ చేశారు. వారిని కూడా అడ్డుకునేందుకు టీటీఈ ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందించారు. టికెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తిది తప్పేనని, అయితే టీటీఈ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని అతడ్ని దారుణంగా కొట్టడం తగదని అన్నారు. ఆ టీటీఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైల్వే మంత్రికి ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు ఈ సంఘటనపై స్పందించారు. ఆ టీటీఈని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
वीडियो आज का है। बरौनी-लखनऊ एक्सप्रेस (15203) में टीटी इस तरह से पिटाई कर रहा।
रेल मंत्री @AshwiniVaishnaw जी, बताएं कि क्या इन लोगों को ऐसे पीटने की आजादी है? क्या टीटी के नाम पर गुंडे रखे गए हैं? ये सिस्टम में क्यों है?
वीडियो साफ है, कार्रवाई कीजिए। और हां, जनता को… pic.twitter.com/Cl5XYxl3GC
— Rajesh Sahu (@askrajeshsahu) January 18, 2024