కోల్‌కతా: గూడు కోసం ఒక పక్షి తీసుకెళ్తున్న పొడవైన వైర్, రైల్వే స్టేషన్‌లోని హైవోల్టేజీ విద్యుత్ లైన్‌కు తగిలింది. ప్లాట్‌ఫామ్ అంచున నిల్చొని ఉన్న ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టీటీఈ)కి ఆ వైర్ రెండో కొన తాకింది. దీంతో ఆ టీటీఈ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఫ్లాట్‌ఫామ్ అంచు నుంచి తలకిందులుగా రైలు పట్టాల పక్కన పడిపోయాడు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అయితే అదృష్టవశాత్తూ ఆ టీటీఈకి ప్రాణాపాయం తప్పింది. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఆ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ అంచున నిల్చొన్న టీటీఈ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఉన్నట్టుండి ఒక విద్యుత్ వైర్ ఆయనకు తగిలింది. దీంతో ఆయన విద్యుదాఘాతానికి గురయ్యాడు. ప్లాట్‌ఫామ్ అంచు నుంచి తలకిందులుగా రైలు పట్టాల పక్కగా వెనక్కి పడ్డాడు.
కాగా, ఆ సమయంలో ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్లో ఉన్న కొందరు ఈ సంఘటన చూసి భయాందోళన చెందారు. తొలుత ఏం జరిగిందో అన్నది ఎవరికీ అర్థం కాలేదు. తేరుకున్న తర్వాత స్పందించారు. విద్యుదాఘాతానికి గురై రైల్వే ట్రాక్ వద్ద తలకిందులుగా పడిన టీటీఈని లేపి ఫ్లామ్‌ఫామ్‌పైకి తెచ్చారు. ఆ వెంటనే స్ట్రెచ్చర్‌పై పడుకోపెట్టి ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఆ టీటీఈకి ప్రాణాపాయం తప్పిందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. విద్యుదాఘాతం వల్ల ఆయనకు కాలిన గాయాలయ్యాయని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ ప్రమాదం చాలా విచిత్రంగా జరిగిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఒక పక్షి తీసుకెళ్తున్న పొడవైన వైరు, రైల్వే హైటెన్షన్ విద్యుత్ లైన్‌కు తగిలిందని తెలిపారు. గాల్లో వేలాడిన ఆ వైర్, ఫ్లాట్‌ఫామ్ అంచున నిల్చొని ఉన్న టీటీఈ తలకి తగిలిందని, దీంతో విద్యుదాఘాతానికి గురైన ఆయన తలకిందులుగా రైలు పట్టాల పక్కన పడిపోయారని వెల్లడించారు. కాగా, ఆ రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A freak accident – a long piece of loose cable, taken by a bird somehow came in contact with the OHE wire and the other end came down and touched a TTE's head. He suffered burn injuries but is out of danger and under treatment – at Kharagpur station yesterday afternoon! #Accident pic.twitter.com/ObEbzd1cOF
— Ananth Rupanagudi (@Ananth_IRAS) December 8, 2022