ముంబై: వ్యాపార సంస్థలో ఒక ఉద్యోగి పదేళ్లకుపైగా పని చేశాడు. యజమాని నమ్మకం పొందాడు. చివరకు వసూలు చేసిన డబ్బుతో పరారయ్యాడు. (Employee Absconds With Moneay) దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. విజయ్ కొటేచా అనే వ్యక్తి ఆజాద్ మైదాన్ ప్రాంతంలో కాస్మెటిక్ ఉత్పత్తుల హోల్సేల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ముకేశ్ కుమార్ దూబే అనే ఉద్యోగి సుమారు పదేళ్లకు పైగా ఆ వ్యాపారి వద్ద పని చేస్తున్నాడు. యజమాని విజయ్ నమ్మకాన్ని అతడు పొందాడు. దీంతో ఇతర వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేయసాగాడు.
కాగా, ముకేశ్ కుమార్ దూబే ఇటీవల పలువురు వ్యాపారుల నుంచి రూ.10.57 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత ఆ డబ్బుతో పారిపోయాడు. దీంతో నిర్ణీత సమయానికి ముకేశ్ తిరిగి రాకపోవడంతో యజమాని విజయ్ అనుమానించాడు. డబ్బులు ఇచ్చిన వ్యక్తులను ఆరా తీశాడు. అలాగే ముకేశ్ కోసం మిగతా సిబ్బందితో వెతికించాడు. ఫలితం లేకపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. డబ్బుతో పారిపోయిన నమ్మకస్తుడైన ఉద్యోగి ముకేశ్ కోసం వెతుకుతున్నారు.