Amartya Sen: భిన్న మతస్థుల మధ్య విశ్వసాన్ని నింపాలి: అమర్త్యా సేన్
Amartya Senప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యా సేన్.. కీలక వ్యాఖ్యలు చేశారు. విభిన్న మతస్థుల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు తొలిగిపోవాలన్నా, ఒకరిపై ఒకరికి ఉన్న తప్పుడు భావాలను అధిగమించాలన్నా, రెండు మతస్థుల మధ్య విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉందని అమర్త్యాసేన్ తెలిపారు. ప్రతీచి ట్రస్టు నిర్వహించిన ఓ
కోల్‌కతా: ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యా సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విభిన్న మతస్థుల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు తొలిగిపోవాలన్నా, ఒకరిపై ఒకరికి ఉన్న తప్పుడు భావాలను అధిగమించాలన్నా, రెండు మతస్థుల మధ్య విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉందని అమర్త్యాసేన్ తెలిపారు. ప్రతీచి ట్రస్టు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అజ్ఞానం, అవిద్య వల్ల భిన్న మతస్థుల్లో విబేధాలు వస్తున్నట్లు ఆయన చెప్పారు. రెండు మతస్థుల మధ్య ఉన్న తేడాలపై చాలా భయానకమైన తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయని, అన్ని రకాలుగా ఆ తేడాలు ఉన్నాయని, ఇవన్నీ అజ్ఞానం, చదువులేకపోవడం వల్ల కలిగే భావనలు అని ఆయన అన్నారు.
ఒక ముస్లిం వ్యక్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, అసలు ఆ వ్యక్తి ఎందుకు ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడో అడిగి తెలుసుకోవాలని అమర్త్యాసేన్ అన్నారు. ఒక అంశం విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య అభిప్రాయబేధాలు ఉంటాయని చెప్పారు. దీని కోసం ఆయన తన అయిదేళ్ల కూతురికి ఎదురైన ఓ ఘటనను గుర్తు చేశారు. స్కూల్ అడ్మిషన్‌కు వెళ్లిన సయమంలో తన కూతురు ఆంటారాకు టీచర్ రెండు రంగుల పెన్సిల్స్ చూపించిందని, రెడ్, బ్లూ కలర్ పెన్సిల్ ఏంటో చెప్పాలని ఆ టీచర్ అడిగిందని, కానీ తన కూతురు దానికి సమాధానం ఇవ్వలేకపోయిందన్నారు. నాన్నా ఆ వ్యక్తికి రేచీకి ఉందా.. కలర్స్ గుర్తించలేడా అని ప్రశ్నించడం తనను బాధించిందని అమర్త్యాసేన్ అన్నారు.
ఈ నేపథ్యంలోనే యుక్త సాధన చేయాలని, హిందువులు.. ముస్లిం కలిసి పనిచేయాలన్నారు. ఇద్దరు ఒక్కటి అయ్యేందుకు దారులు వెతుకాలని, చిన్న చిన్న అంశాలతోనే కలిసిపోవాలని, హిందూ-ముస్లిం సంస్కృతి ఏకీకరణకు పనిచేయాలని అమర్త్యాసేన్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

