న్యూఢిల్లీ, అక్టోబర్ 8: అమెరికా, భారత్కు చెందిన పలు ఐటీ సంస్థలకు ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసా కార్మికులకు గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కంపెనీలను అనుమతించే శాశ్వత కార్మిక ధ్రువీకరణ కార్యక్రమం నుంచి కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టాటా, విప్రో, హెచ్సీఎల్, క్యాప్ జెమినీ, మైక్రోసాఫ్ట్ అడోబ్లను అమెరికా రద్దు చేసింది.
ఈ మేరకు యూఎస్ కార్మిక శాఖ మంత్రి కీత్ శాండరింగ్, దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఒక ప్రకటన చేశారు. ఈ కంపెనీలకు సంబంధించి పెండింగ్లో ఉన్న పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తులను ఇకపై పరిశీలించబోమని తెలిపింది. 2009 నుంచి కేవలం ఈ సంస్థల నుంచే 30 లక్షల మంది విదేశీ కార్మికులకు సంబంధించి వినతులు వచ్చాయని చెప్పారు. ఇలా ఈ సంస్థలు వందలు, వేల ఉద్యోగాలను అమెరికా కార్మికులకు దక్కకుండా అడ్డుకున్నాయని వారు వ్యాఖ్యానించారు.