చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణానికి రంగం సిద్ధమవుతున్న క్రమంలో ఆయన పార్టీ వర్గాల్లో సంచలన వార్త చక్కర్లు కొడుతున్నది. విజయ్ గర్ల్ఫ్రెండ్గా భావిస్తున్న నటి త్రిష త్వరలోనే ఆ పార్టీలో చేరనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమె పార్టీలో చేరి విజయ్ పోటీ చేసి విజయం సాధించిన తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గంలో పోటీ చేస్తారని తెలిపాయి. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన విజయ్ తిరుచిరాపల్లిని వదులుకోనున్నారు. 14 రోజులకు మించి విజయ్ రెండు నియోజకవర్గాలను ఉంచుకునే అవకాశం లేకపోవడంతో ఒకదానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. అందులో త్రిషను పోటీ చేయించాలని పార్టీ వర్గాలు ఉత్సాహం చూపిస్తున్నాయి.