న్యూఢిల్లీ: వందేమాతరం గీతం 150వ వార్సికోత్సవం సందర్భంగా ఇవాళ లోక్సభ(Parliament)లో చేపట్టిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. అయితే వందేమాతర గీతాన్ని బెంగాలీ కవి బంకిమ్ చంద్ర ఛటర్జీ రాశారని మోదీ అన్నారు. ఆ సమయంలో బంకిమ్ గురించి ప్రస్తావిస్తూ.. బంకిమ్ దా అని ప్రధాని మోదీ అన్నారు. బెంగాలీ ప్రఖ్యాత కవి, కంపోజర్ను బంకిమ్ దా అని పిలవడాన్ని.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ తప్పుపట్టారు. బంకిమ్ను దాతో సంబోధించడాన్ని ఆయన వ్యతిరేకించారు. దా అంటే బెంగాలీలు దాదా అని అంటే సోదరులను, స్నేహితులను సంబోధించేందుకు ఆ పదాన్ని వాడుతుంటారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో బంకిమ్ దా అనడడం అగౌరవపరచడమే అవుతుందని, బంకిమ్ దా అనడం కాదు, బంకిమ్ బాబు అని పిలవాలని తృణమూల్ ఎంపీ అన్నారు.
ఎంపీ సౌగత్రాయ్ చేసిన సూచనకు ప్రధాని మోదీ తక్షనమే స్పందించారు. సరే బంకిమ్ బాబు అని పిలుస్తానని, థ్యాంకూ.. మీ మనోభావాలను గౌరవిస్తానని ప్రధాని మోదీ అన్నారు. ఆ తర్వాత తన ప్రసంగంలో టీఎంసీ ఎంపీపై వ్యంగ్యాస్త్రం వేశారు. మిమ్మల్ని దాదా అని పిలవవచ్చా అని అన్నారు. దీనికేమానా అభ్యంతరాలు ఉన్నాయా అని ప్రధాని అన్నారు. కేవలం రాజకీయ స్వేచ్ఛ కోసం వందేమాతరం మంత్రాన్ని వాడలేదని, బ్రిటీష్ పాలకుల నుంచి భరతమాతను రక్షించేందుకు ఆ పవిత్ర గేయ సమరం సాగిందన్నారు.
Modi insulted Bankim Chandra Chatterjee in the Parliament.
He was referring him aa ‘da’, then an MP from opposition corrected him that he should say ‘Bankim Babu’ not ‘da’.
Modi realised his mistake and instead of saying sorry, he said Thankyou Thankyou…. pic.twitter.com/remGphGkD7
— Shantanu (@shaandelhite) December 8, 2025