బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ఆందోళన.. ప్రసంగం ఆపేసిన గవర్నర్
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాల తొలి రోజున సభలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించారు. దీంతో గవర్నర్ తన ప్రసంగాన్ని ఆపేసి, సభ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సహా టీఎంసీ ఎమ్మెల్యేలు గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనల మధ్య తాను ప్రసంగం చేయలేనని గవర్నర్ జగదీప్ ధంఖర్ చెప్పారు. సీఎం మమతా, టీఎంసీ ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు తన ప్రసంగంలోని మొదటి, చివరి వ్యాఖ్యలను చదివి సభ నుంచి గవర్నర్ వెళ్లిపోయారు. బెంగాల్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక పరిణామాలపై బీజేపీ సభలో ఆందోళనకు దిగింది.
అయితే ఈ ఘటనపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగి, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుపడ్డారని ఆరోపించారు. రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించేందుకు బీజేపీ యత్నిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ ఎమ్మెల్యేలు గంటకు పైగా ఆందోళనలు చేసినప్పటికీ తాము ఓపికతో ఉన్నామని తెలిపారు. స్పీకర్ అనేకసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. తాను కూడా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశానని మమత పేర్కొన్నారు. ఇదంతా బీజేపీ డ్రామా అని కోపోద్రిక్తులయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి అవమానం కలిగించే విధంగా ఉందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

