కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్, విపక్ష బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగుతున్నది. తాజాగా సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనను ఓడించడానికి కేంద్రం, 19 రాష్ర్టాలు ఏకమయ్యాయని అన్నారు.
సామాన్య ప్రజల కోసం తాను ఒంటిచేత్తో పోరాడుతున్నానని పేర్కొన్నారు. సోమవారం బీర్భుమ్ జిల్లాలో సురి ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, ఢిల్లీ నుంచి బలగాలను దింపినంత మాత్రాన, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలువలేదని ఆమె అన్నారు. తమ పార్టీ 226 స్థానాలకు మించి గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.