హైదరాబాద్ : మధ్యప్రదేశ్లో(Madhya Pradesh )దారుణం చోటు చేసుకుంది. కన్నకొడుకు ముందే దుండగులు తల్లిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో జూన్ 18వ తేదీ రాత్రి ఒక వ్యవసాయ క్షేత్రంలో 30 ఏళ్ల గిరిజన మహిళపై(Tribal woman) ఆమె 12 ఏళ్ల కుమారుడి ముందే సామూహిక లైంగిక జరిగినట్లు బాధితురాలు ఆరోపించారు. బద్నగర్ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్ వద్ద బాధిత మహిళ కుటుంబ సభ్యులు సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్నారు. కాగా, అర్ధరాత్రి ఐదుగురు దొంగలు ఫాం హౌస్ వద్ద గుడిసెలో నిద్రపోతున్న సమయంలో వారిని నిద్రలేపి మహిళ భర్తను తుపాకితో బెదిరించి అతడిపై దాడి చేశారు.
అనంతరం దొంగలు తనను, తన కుమారుడిని సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. వారిలో ఒకడు ఆ బాలుడి సమక్షంలోనే తుపాకీతో బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగలపై కేసు నమోదు చేశామని ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని స్టేషన్ ఇన్చార్జ్ తెలిపారు.