ముంబై: ముంబైలో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ ప్రభావంతో ముంబై నగరం అతలాకుతలం అవుతున్నది. పలుచోట్ల వృక్షాలు కూలిపోయాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. శివసేన భవన్ సమీపంలో కూడా గాలివాన ధాటికి కరెంటు స్తంభం విరిగిపడింది. పలు చెట్లు కూలిపోయాయి. దాంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు.
Maharashtra: Trees uprooted, streets waterlogged in different parts of Mumbai due to heavy rain and wind. Visuals from Juhu.#CycloneTaukte pic.twitter.com/4iHnHvJMB2
— ANI (@ANI) May 17, 2021