ముంబై: దిగ్గజ గాయని లతామంగేష్కర్ ఆరోగ్యం మళ్లీ విషమించింది. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు డాక్టర్లు చెప్పారు. నెలకింద లతా మంగేష్కర్‌కు కరోనా సోకడంతో ముంబైలోని బీచ్ క్యాండీ దవాఖానలో చేరారు. అప్పుడే ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కొద్ది రోజుల తర్వాత కాస్త కోలుకోవడంతో వెంటిలేటర్‌ను తొలగించినప్పటికీ డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఒక్కసారిగా ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని, దీంతో మళ్లీ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని శనివారం డాక్టర్లు చెప్పారు.