న్యూఢిల్లీ : తీవ్రమైన రొమ్ము క్యాన్సర్ కణాలను తేనెటీగల విషం నాశనం చేయగలదని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిశోధన ఉత్తేజభరితంగా ఉందని, మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు. తేనెటీగల విషాన్ని దానిలో ఉండే మెలిట్టిన్ అనే పదార్థాన్ని రెండు రకాల క్యాన్సర్లపై ఉపయోగించినట్లు చెప్పారు. అవి: ట్రిపుల్ నెగెటివ్, హెచ్ఈఆర్2 ఎన్రిచ్డ్ అని పేర్కొన్నారు. వీటికి చికిత్స చేయడం చాలా కష్టమని తెలిపారు. వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని హారీ పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ఈ అధ్యయనం జరిగింది. ఈ నివేదికను నేచర్ ప్రెసిషన్ ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించారు.