తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయానికి వెళ్లే భక్తులకు రోడ్డు ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. పథనంతిట్ట, కొల్లం, అలప్పుజ, ఇడుక్కి జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగి, అయ్యప్ప స్వామి భక్తులు ప్రాణాలు కోల్పోతే, వారి కుటుంబాలకు రూ.5 లక్షలు నష్టపరిహారం చెల్లించనున్నట్లు చెప్పింది.
భక్తులకు ఈ బీమా కవరేజ్‌ను ఉచితంగానే అందిస్తున్నట్లు వివరించింది. దీని కోసం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్ప ందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.