న్యూఢిల్లీ: జూన్ 21న నిర్వహించనున్న నీట్-యూజీ పునఃపరీక్ష ప్రశ్నపత్రాల రూపకల్పనలో పాల్గొన్న నిపుణులను ఒక రహస్య ప్రాంతంలో లాక్డౌన్లో ఉంచారు. ప్రశ్నపత్రం లీకేజీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రను ఏర్పాటు చేశారు. నీట్ రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేస్తున్న నిపుణులందరినీ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ సదుపాయం, బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉంచారు. ప్రశ్నపత్రం లీక్ కాణంగా 22 లక్షల మందికిపైగా అభ్యర్థుల జీవితాలు అయోమయంలో పడ్డాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నపత్రాల రూపకర్తలు, మోడరేటర్లు, అనువాదకులు, ఇతర సిబ్బంది ప్రస్తుతం పూర్తి రక్షణ కలిగిన సురక్షిత ప్రాంతంలో, 24 గంటల నిఘా నీడలో ఉన్నారు. ఆ ప్రాంగణంలోకి రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు.్త కేవలం అనుమతి ఉన్న సిబ్బందికి మాత్రమే ప్రవేశం కల్పించారు. జూన్ 21న పునఃపరీక్ష పూర్తయ్యేంత దాకా వీరు లాక్డౌన్ లోనే ఉంటారు.
ప్రశ్నపత్రాల తరలింపునకు ఎయిర్ఫోర్స్ ఎంఐ17 హెలికాప్టర్లు
పరీక్షల నిర్వహణలో ప్రశ్నపత్రాల రవాణా అనేది మరో కీలకమైన అంశంగా మారింది. దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాలను సురక్షితంగా రవాణా చేయడానికి ఎంఐ17 హెలికాప్టర్లు, ఇతర వైమానిక సిబ్బందిని మోహరించనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.