ఆ రైలు 20 నిమిషాల ముందే గమ్య స్థానానికి చేరుకుంది. అంతే… ప్రయాణికుల ఆనందానికి హద్దే లేదు. ఆ ట్రైన్ ప్లాట్‌ఫామ్ పైకి రావడమే ఆలస్యం… ప్లాట్‌ఫామ్ పైకి వచ్చేశారు. గర్భా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టేశారు. చాలా దూరం ప్రయాణమని, 20 నిమిషాల ముందే రైలు గమ్య స్థానానికి చేరుకుందని, అందుకే అందరమూ గర్భా డ్యాన్స్ చేస్తున్నామని ప్రయాణికులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది జరిగింది రత్లాం స్టేషన్.
హరిద్వార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కేటాయించిన సమయాని కంటే 20 నిమిషాల ముందే రత్లాం స్టేషన్‌కి చేరుకుంది. అంతే ఓ బోగీలోని ప్రయాణికులు గర్భా డ్యాన్స్ చేయడం ప్రారంభించేశారు. అంతేకాకుండా గుజరాత్లో అత్యంత హిట్ కొట్టిన పాటలు, బాలీవుడ్ పాటలపై కూడా డ్యాన్స్ చేశారు. కాసేపు ఏం జరుగుతుందో అక్కడెవ్వరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత అర్థం చేసుకొని… చిన్న పిల్లలు మొదలుకొని, వృద్ధుల వరకూ డ్యాన్స్ చేసేశారు.
దాదాపు 90 మందితో వున్న ఓ బృందం గుజరాత్ నుంచి కేదార్నాథ్ బయల్దేరింది. కేటాయించిన సమయం కంటే 20 నిమిషాల ముందే రత్లాం అనే స్టేషన్‌కి చేరుకుంది. అంతే… అలసట తీర్చుకోవడానికి… చాలా మంది ప్లాట్‌ఫాంపైకి వచ్చేసి, డ్యాన్స్ చేశారు. 20 నిమిషాల పాటు అదే బోగీలో కూర్చునే బదులు… ఇలా డ్యాన్స్ చేస్తే అలసట తీరిపోతుందనే ఇలా చేశామని ప్రయాణికులు పేర్కొన్నారు.
ज़िंदगी को जिंदादिली से जियो 🙂
रतलाम रेलवे स्टेशन पर समय से पहले पहुंच गई ट्रेन! हॉल्ट लंबा था लिहाज़ा पैसेंजर्स ने प्लेटफार्म पर गरबा कर बोरियत दूर की @RatlamDRM @RailMinIndia @AshwiniVaishnaw pic.twitter.com/zXg2mVRY1y
— Ravish Pal Singh (@ReporterRavish) May 26, 2022