కుమారుడిని గుండెలకు హత్తుకుని… చివరిక్షణం వరకు చావుతో పోరాటం
మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ క్రూయిజ్ బోట్ జబల్పూర్ సమీపంలోని నర్మదానదిపై బర్గీ డ్యామ్‌లో బోల్తాపడిన ఘటనలో మృతదేహాల వెలికితీతలో పలు విషాద దృశ్యాలు కన్పించాయి.
- జబల్పూర్ బోట్ ప్రమాదంలో విషాదం
జబల్పూర్ : మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ క్రూయిజ్ బోట్ జబల్పూర్ సమీపంలోని నర్మదానదిపై బర్గీ డ్యామ్‌లో బోల్తాపడిన ఘటనలో మృతదేహాల వెలికితీతలో పలు విషాద దృశ్యాలు కన్పించాయి. గురువారం భారీ ఈదురుగాలుల కారణంగా 30 మందితో వెళ్తున్న బోట్ బోల్తాపడిన ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, పలువురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.
ఒక మహిళ, తన నాలుగేండ్ల కుమారుడిని గుండెలకు హత్తుకుని ఉండగా, ఇద్దరికీ ఒకే లైఫ్ జాకెట్‌తో బిగించి ఉన్న స్థితిలో ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ బృందాలు శుక్రవారం వెలికితీశాయి. తన కుమారుడిని కాపాడటానికి చివరి క్షణం వరకు ఆ తల్లి ప్రయత్నించినట్టు తల్లీ బిడ్డల మృతదేహాలను చూస్తే తెలుస్తున్నది. ఈ ప్రమాదంలో పర్యాటక శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కన్పించిందని, బోట్లోని ప్రయాణికులందరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వలేదని, ప్రమాదం సంభవించిన తర్వాత ఇవ్వడం ప్రారంభించారని కొందరు ప్రయాణికులు ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

