ఇంఫాల్, డిసెంబర్ 21: స్నేహితులందరితో కలిసి స్టడీ టూర్‌కు వెళ్తున్నామన్న ఆనందం.. కేరింతలు.. మిమిక్రీలతో నవ్వుల జడి కురిసిన వేళ ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో 8 మంది విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 20 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన మణిపూర్‌లోని నానీ జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది. జిల్లాలోని ఓ పాఠశాల యాజమాన్యం విద్యార్థులను రెండు బస్సుల్లో స్టడీ టూర్‌కు తీసుకెళ్లింది. ఈ బస్సులు బిస్నుపూర్-ఖౌపురం చేరుకొనేసరికి ఓ బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు బోల్తా పడింది.