బెంగళూరు: వాహనాల హారన్ మోత ఎంత ఇరిటేట్ చేస్తుందో మాటల్లో చెప్పలేం. రోడ్డుపై వెళ్లే వారికి వాహనాల హారన్ మోత చికాకుతో పాటు ఇబ్బంది కలిగిస్తుంది. (Vehicle’s Shrilling Horn) ఈ నేపథ్యంలో ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారి దీనిపై సీరియస్‌గా స్పందించారు. అదే పనిగా హారన్ మోత మోగించిన డ్రైవర్లకు వినూత్నంగా శిక్ష విధించారు. వారి వాహనం నుంచి హారన్ మోగించి ఆ డ్రైవర్లు వినేలా చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. అదే పనిగా హారన్ మోగించే బస్సులను ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారి నిలిపివేశారు. డ్రైవర్లను బస్సుల నుంచి కిందకు దిగమని చెప్పారు.
కాగా, ఆ బస్సులకు అమర్చిన హారన్ వద్ద డ్రైవర్లను మోకాళ్లపై కూర్చోబెట్టారు. వారి వాహనాల హారన్‌ను డ్రైవర్లకు వినిపించారు. హారన్ శబ్దం వారికి ఎంత చికాకు, ఇబ్బంది కలిగించిందో అడిగి తెలుసుకున్నారు. మిగతా వాహనదారులు, జనం కూడా అలాంటి ఇబ్బంది ఎదుర్కోవడాన్ని ప్రత్యక్షంగా వారికి చూపించారు. ఈ మేరకు వినూత్నంగా శిక్ష విధించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ ట్రాఫిక్ పోలీస్ అధికారి చర్యను నెటిజన్లు ప్రశంసించారు.
In Karnataka, the traffic police stopped drivers who were honking unnecessarily and made them stand in front of their vehicles.
Swag level: Infinity ♾️
pic.twitter.com/OngNFpjaRy— Aaraynsh (@aaraynsh) January 20, 2025