Maharashtra | కెమికల్ యూనిట్లో గ్యాస్ లీక్.. ఒకరి మృతి
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోగల తారాపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని రసాయన యూనిట్లో ఆదివారం ఉదయం విషపూరిత వాయువు లీక్ అయ్యింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. ఊపిరాడక కొందరు కుప్పకూలిపోగా, వారిని దవాఖానకు తరలించారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోగల తారాపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని రసాయన యూనిట్లో ఆదివారం ఉదయం విషపూరిత వాయువు లీక్ అయ్యింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందాడు. ఊపిరాడక కొందరు కుప్పకూలిపోగా, వారిని దవాఖానకు తరలించారు.
డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ తయారు చేసే కంపెనీ ప్లాంట్‌లో ఆదివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు జిల్లా విపత్తు నిర్వహణ విభాగం చీఫ్ వివేకానంద్ కదమ్ తెలిపారు. గ్యాస్ లీకేజీ కారణంగా యూనిట్లో ఉన్న కార్మికులు స్పృహ కోల్పాయారని పేర్కొన్నారు. మృతిచెందిన కార్మికుడిని భగవత్ చౌపాల్ (22)గా గుర్తించినట్లు అధికారి తెలిపారు. మరో నలుగురిని సమీపంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. విషయం తెలుసుకున్న ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ హెల్త్ డైరెక్టరేట్ అధికారులు.. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్తో కలిసి ప్లాంట్‌కు చేరుకున్నారని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారని కదమ్ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

