Pune fort | పుణె ఫోర్టులో దారుణం.. ఎనిమిదేళ్ల చిన్నారి షార్ట్ వేసుకుందని పర్యాటకులపై దాడి
Pune fort | పుణే (Pune) లోని చారిత్రాత్మక సింహగడ్ కోట (Simahagarh Fort) లో పర్యాటకులపట్ల కొందరు యువకులు దశ్చర్యకు పాల్పడ్డారు. పర్యాటకులు (Tourists) ధరించిన దుస్తులపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సాగించిన ఈ దౌర్జన్యంలో ఎనిమిదేళ్ల చిన్నారితో సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదుచేశారు.
Pune fort : పుణే (Pune) లోని చారిత్రాత్మక సింహగడ్ కోట (Simahagarh Fort) లో పర్యాటకులపట్ల కొందరు యువకులు దశ్చర్యకు పాల్పడ్డారు. పర్యాటకులు (Tourists) ధరించిన దుస్తులపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సాగించిన ఈ దౌర్జన్యంలో ఎనిమిదేళ్ల చిన్నారితో సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదుచేశారు. ఆగస్టు 16న ఈ సంఘటన చోటుచేసుకుంది.
కోట సందర్శనకు వచ్చిన ఒక కుటుంబాన్ని అడ్డుకున్న కొందరు యువకులు, వారి ఎనిమిదేళ్ల కుమార్తె షార్ట్స్ ధరించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో తలెత్తిన వాగ్వాదం చివరకు భౌతిక దాడికి దారితీయడంతో కుటుంబసభ్యుల్లో ఒకరు గాయపడ్డారు. తమను తాము ‘కోట సంరక్షణ సమితి’ సభ్యులుగా చెప్పుకుంటున్న ఈ బృందం.. సుమారు రెండు గంటలపాటు కోట పరిసరాల్లో అలజడి సృష్టించింది. షార్ట్ వంటి అనుచితమైన దుస్తులు ధరించారనే నెపంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అని కూడా చూడకుండా పలువురిపై దాడులకు తెగబడ్డారు.
ఈ అరాచకంతో కోటలోని పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు హవేలీ పోలీసులు నిందితులుగా గుర్తించిన తొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

