Tomato Price | నాగపట్టణం: దేశవ్యాప్తంగా డబుల్ సెంచరీ దాటిన టమాట ధరలు తగ్గాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కొందరైతే వాటి ధరలు తగ్గాలని దేవుళ్లకు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు. ‘టమాట ధరలు తిరిగి పూర్వ స్థితికి తెచ్చేలా చెయ్ భగవంతుడా’ అని వేడుకుంటూ తమిళనాడులోని ఒక గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు. నాగపట్టణం జిల్లా కరుకుడిలోని శ్రీ మరియమ్మన్, నాగమ్మన్ ఆలయంలో అడిమాస పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ పూజలో భక్తులు 508 టమాటాలతో దండగుచ్చి దేవుడికి అలంకరించారు.