Watch: రెజ్లర్ల నిరసనలో పాల్గొనేందుకు.. బారికేడ్లను తొలగించి చొచ్చుకెళ్లిన రైతులు
farmers | ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్ల వద్దకు వందలాది రైతులు (Farmers) చేరుకున్నారు. అయితే వారిని నిలువరించేందుకు పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాగా, రైతులు వీటిని లెక్కచేయలేదు. వాటిని తొలగించి, దాటుకుని వెళ్లారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం ఉదయం హైడ్రామా నెలకొన్నది. నిరసన చేస్తున్న రెజ్లర్ల వద్దకు వందలాది రైతులు (Farmers) చేరుకున్నారు. అయితే వారిని నిలువరించేందుకు పోలీసులు జంతర్ మంతర్ వద్ద భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాగా, రైతులు వీటిని లెక్కచేయలేదు. వాటిని తొలగించి, దాటుకుని వెళ్లారు. ఈ సందర్భంగా కొన్ని బారికేడ్లను రైతులు ధ్వంసం చేశారు. భారీగా ఉన్న పోలీసులను ప్రతిఘటించి జంతర్ మంతర్‌లోకి ప్రవేశించారు. నిరసన చేస్తున్న రెజ్లర్ల వద్దకు వెళ్లి అక్కడ బైఠాయించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఈ సంఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. సురక్షిత ప్రవేశం కోసమే జంతర్ మంతర్ వద్ద మెటల్ డిటెక్టర్‌తోపాటు బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ధర్నా చేస్తున్న రెజ్లర్ల వద్దకు వెళ్లే ఆత్రుతలో కొందరు రైతులు బారికేడ్లను దాటుకుని వెళ్లారని, మరికొందరు వాటిని తొలగించారని చెప్పారు. దీనికి సంబంధించిన నకిలీ వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరారు.
మరోవైపు బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లతో సహా దేశంలోని పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద రెండోసారి 15 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేసి ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాని డిమాండ్ చేస్తున్నారు. పలు రంగాలకు చెందిన వ్యక్తులతోపాటు రైతులు కూడా రెజ్లర్ల నిరసనకు మద్దతు తెలిపారు.
#WATCH | Farmers break through police barricades as they join protesting wrestlers at Jantar Mantar, Delhi
The wrestlers are demanding action against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over allegations of sexual harassment. pic.twitter.com/k4d0FRANws
— ANI (@ANI) May 8, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

