లక్నో: టోల్ ట్యాక్స్ చెల్లించకుండా ఉండేందుకు టోల్ బూత్ నుంచి కారు వేగంగా దూసుకెళ్లింది. అడ్డుగా వచ్చిన టోల్ బూత్ ఉద్యోగిని వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Toll Plaza Employee Tossed In Air) ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఢిల్లీ-లక్నో హైవేపై ఉన్న ఛిజర్సీలోని టోల్ ప్లాజా నుంచి ఒక కారు వేగంగా దూసుకెళ్లింది. నడుస్తూ రోడ్డు దాటుతున్న టోల్ బూత్ వ్యక్తిని వేగంగా ఢీకొట్టింది. దీంతో గాల్లోకి ఎగిరిన అతడు ఆ కారు బానెట్‌పై పడ్డాడు. ఆ తర్వాత కారు పైనుంచి రోడ్డుపై పడ్డాడు.
కాగా, ఆ టోల్ బూత్‌లోని మిగతా సిబ్బంది పరుగున్న ఆ వ్యక్తి వద్దకు చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతడి పరిస్థితి సీరియస్‌గా ఉందని డాక్టర్లు తెలిపారు.
మరోవైపు పోలీసులకు ఈ సమాచారం అందింది. పరిస్థితి విషమంగా ఉన్న టోల్ బూత్ సిబ్బందిని హేమ్‌రాజ్‌గా గుర్తించారు. టోల్ ట్యాక్స్ చెల్లించకుండా వేగంగా దూసుకెళ్లి సిబ్బందిని ఢీకొట్టిన కారును గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी : दिल्ली-लखनऊ हाईवे पर हापुड़ जिले में टोल प्लाजा पर कल रात तेज रफ्तार कार ने टोल कर्मचारी हेमराज को हवा में उड़ा दिया। टोलकर्मी की हालत गंभीर है, कार सवार की तलाश जारी है। pic.twitter.com/Tak5Zscq1A
— Sachin Gupta (@SachinGuptaUP) June 7, 2024