బిర్యానీ ఫెస్టివల్లో బీఫ్ తొలగింపు… కలెక్టర్‌ను నిలదీసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్
చెన్నై: బిర్యానీ ఫెస్టివల్లో బీఫ్‌ను తొలగించడం వివాదస్పదమైంది. దీంతో ఆ జిల్లా కలెక్టర్‌ను ఎస్సీ, ఎస్టీ కమిషన్ నిలదీసింది. ఈ వివక్షపై వివరణ ఇవ్వాలని కోరింది. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 12 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ‘అంబూర్ బిర్యానీ పండుగ’ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా తమిళనాడులోని ప్రసిద్ధ అంబూర్ బిర్యానీకి భౌగోళిక గుర్తింపుపై స్టాల్స్ నిర్వాహకులు ఆశలు పెట్టుకున్నారు. అలాగే బిర్యానీ ఫెస్టివల్ సందర్భంగా 20 రకాల బిర్యానీ స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మెనూలో బీఫ్ బిర్యానీని మినహాయించింది. అయితే వర్షాల కారణంతో బిర్యానీ ఫెస్టివల్‌ను వాయిదా వేసింది.
మరోవైపు బిర్యానీ ఫెస్టివల్ మెనూ నుంచి గొడ్డు మాంసం బిర్యానీని తొలగించడంపై కొందరు ఆ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆ కమిషన్ తిరుపత్తూరు జిల్లా కలెక్టర్ అమర్ కుష్వాహను దీనిపై నిలదీసింది. వర్గ వివక్షతో కూడిన ఈ నిర్ణయంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ అంశంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని ఆ నోటీసులో ప్రశ్నించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

